ఇండస్ట్రీలో ఏ రికార్డు ఎవరికి సొంతం కాదు . ఒక హీరో క్రియేట్ చేయడం ..మరొక హీరో అది బ్రేక్ చేయడం.. ఇదే ఇండస్ట్రీ సాంప్రదాయం. ఇప్పటివరకు సినీ చరిత్రలో ఇలాగే కొనసాగుతూ వచ్చింది.  అయితే పుష్ప2 సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇక పుష్ప2 సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది అని..ఇక పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసే సాహసం ఏ హీరో చేయడు అంటూ చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . అయితే ఎవరు ఊహించని విధంగా పుష్ప సినిమా రిలీజ్ అయిన రెండు నెలలకే చావా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది . బాలీవుడ్ హిస్టరీలో పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్ దాటేస్తుంది.  అంతేకాదు అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ని ఏ రేంజ్ లో పొగిడేసారో పుష్ప2 సినిమా చూసి జనాలు అంతకంటే డబుల్ కాదు ట్రిపుల్ స్థాయిలోనే విక్కి కౌశల్ ని పొగిడేస్తున్నారు.


ఆశ్చర్యం ఏంటంటే తెలుగు జనాలు కూడా విక్కీ కౌశల్ నటనకు ఫిదా అయిపోవడం ఇక్కడ హైలెట్గా మారింది. కామన్ పీపుల్స్ కూడా చావా సినిమా చూసి విక్కీ కౌశల్ నటనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే పుష్ప2 రికార్డ్స్ పాన్ ఇండియా లెవెల్ లో బ్రేక్ చేసే సత్తా ఏ హీరోకి ఉంది అంటూ ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . నిజం చెప్పాలి అంటే అలాంటి ఒక సినిమా ఇప్పుడు అప్పట్లో రిలీజ్ అవ్వదు. పుష్ప2  సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే కేవలం అది మహేష్ బాబు వల్ల సాధ్యమవుతుంది అని.. అది కూడా రాజమౌళి దర్శకత్వం వల్లే సాధ్యమవుతుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు.



ఇండస్ట్రీలో మిగతా పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్ వల్ల అది కానే కాదు అని .. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా కారణంగానే పుష్ప2 సినిమా రికార్డ్స్ బ్రేక్ అయితే అవ్వాలి కాని ..లేకపోతే ఇక మరో పదేళ్లు పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప2  రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా ఏది రాదు రాబోదు అంటూ మాట్లాడుకుంటున్నారు . చాలామంది మాత్రం మహేష్ బాబు నే ఈ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ మహేష్ బాబు - రాజమౌళి సినిమాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.  అందుకున్న సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో ఎస్ ఎస్ ఎం బి 29 టీం  మొత్తం ఆఫ్రికా అడవులకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది . అక్కడే నెల రోజులపాటు షూటింగ్ చేయబోతున్నారట.  మహేష్ బాబుకు క్రేజీ కండిషన్స్ పెట్టి మరి ఈ సినిమా షూట్ కి తీసుకెళ్తున్నాడు రాజమౌళి అంటూ న్యూస్ కూడా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: