
నాగచైతన్య ఇప్పుడు తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి .. కోట్లాదిమంది అక్కినేని అభిమానుల డ్రీమ్ ని నెరవేర్చేశాడు. అయితే ఇక్కడే ఇప్పుడు అభిమానులకి కొన్ని కొన్ని పనులు నాగచైతన్య చేయడం నచ్చలేదు . నాగచైతన్య 100 కోట్ల క్లబ్ లోకి చేరితే చూడాలి అని నాగార్జున - అఖిల్ ఎంత ఆశపడ్డారో తెలియదు కానీ నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా కష్టపడ్డారు ..ట్రై చేశారు . నాగచైతన్య ఎలాగైనా సరే వందకోట్ల క్లబ్ లోకి చేరి అక్కినేని ఫ్యామిలీ పరువును నిలబెట్టాలి అంటూ చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మనసులోని కోరికను బయటపెట్టారు.
ఫైనల్లీ తండేల్ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం అక్కినేని అభిమానులు అన్న సంగతి మర్చిపోకూడదు. ఫైనల్లీ అక్కినేని నాగచైతన్య ఆ కోరికను కూడా తీర్చేశారు . అయితే ఈ సినిమా ఎప్పుడైతే 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయిందో అప్పటినుంచి నాగచైతన్య సినిమా ప్రమోట్ చేసుకోవడం మానేశాడు . అంతేకాదు సినిమా టీం ప్రమోషన్స్ కి రమ్మంటున్న కూడా వేరే సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారట . డైరెక్టర్ చందూ తప్పిస్తే ఇప్పుడు ఎవరు సినిమాని ఎవ్వరు ప్రమోట్ చేయడం లేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు.
సినిమాకి ముందు చేసిన అన్ని ప్రమోషన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా 100 కోట్లు దక్కించుకున్న తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే అంత సవ్యంగానే తండేల్ విషయంలో జరిగిపోయినట్లే . తండేల్ కి అన్ని ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. ఇక నాగచైతన్య ప్రమోషన్స్ లో పాల్గొన్న పాల్గొనక పోయిన పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు . అందుకే నాగచైతన్య తన పర్సనల్ కెరియర్ చూసుకుంటూ సినిమా విషయాన్ని వదిలేసాడు అని తండేల్ విషయంలో చేతులు దులిపెసుకున్నాడు అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ అక్కినేని ఫ్యాన్స్ ని బాగా బాధ పెట్టేస్తున్నాయి..!