
దీంతో చాలామంది కమెడియన్ పృథ్వీని తప్పు పట్టడం జరిగింది. సినిమా ఈవెంట్లో పొలిటికల్ మాట్లాడాల్సిన అవసరము లేదని, ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినీ ఇండస్ట్రీ మీద పడుతుందనే విధంగా హెచ్చరించారు. దీంతో అటు పృథ్వీ రాజ్ క్షమాపణలు చెప్పిన కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా తాను ట్విట్టర్ లోకి వచ్చాను అంటూ ఈరోజు ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ కి హాయ్ చెప్పారు పృథ్వీరాజ్ . దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
హాయ్.. నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని.. అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ తన భావాలను తాను స్టేజ్ పైన ప్రకటిస్తూ ఉంటే.. చాలామంది ఫీల్ అవుతున్నారు. అందుకే ఈరోజు ట్విట్టర్ వేదికగా ఉపయోగించుకొని తన భావ ప్రకటనలను వెల్లడిస్తానని తెలియజేశారు.. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ ఉండగా.. కొంతమంది మొన్న చేసింది సరిపోలేదా.. మళ్లీ ఇప్పుడు అవసరమా అంటూ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది నాగరాజు గారు ఇక మొదలెట్టండి అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. పృథ్వీరాజ్ ట్విట్టర్ అకౌంట్ తన కెరీర్ కు ఉపయోగపడుతుందా లేకపోతే మరే విధంగా ఉపయోగపడుతుందా అనేది చూడాలి మరి.