యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
అతడు మైక్ పట్టుకుంటే ఆ తర్వాత జరిగేది అంతా ఒక చరిత్ర అని ఆమె చెప్పుకొచ్చారు. డెడ్లియెస్ట్ షో డౌన్ మొదలైందని ఆమె వెల్లడించారు. విధ్వంశానికి అడ్డా అయిన ప్రాంతానికి స్వాగతం అని లిఖితా రెడ్డి చెప్పుకొచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూడలేకున్నా అంటూ ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సైతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఏ స్థాయిలో అభిమానం ఉందో లిఖితా రెడ్డి చెప్పకనే చెప్పేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బిజినెస్ విషయంలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ సినిమాను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాలి.
 
ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం దాదాపుగా ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. యంగ్ టైగగ్ర్ ఎన్టీఆర్ కు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: