
ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. గ్లామర్ పాత్రలతో తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ విపరీతంగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.
సురేఖ వాణి సోషల్ మీడియాలో హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సురేఖ వాణికి ఓ కూతురు ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వాటిని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా... ఈ బ్యూటీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.
చాలా కాలం నుంచి సురేఖ ఓ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో మునిగిందని అతనితో డేటింగ్ చేస్తుందని చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ ఓ దర్శకుడుతో ఐలాండ్ కు వెళ్లిందట. అక్కడ సురేఖ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అక్కడ సురేఖ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని తన అందాలను చూపిస్తూ ఎంజాయ్ చేస్తోంది.