ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . ఏ సినిమా అయినా సరే ఏ భాషలో రిలీజ్ అయితే హిట్ అయితే ఆ భాష కాకుండా పక్క భాషలో ఆ సినిమాను డబ్ చేయడానికి ఎప్పుడు కాచుకుని ఉంటారు ఒక టీం.  మరీ ముఖ్యంగా తెలుగులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమాలను బాలీవుడ్ లో ఎలా డబ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా సినిమాలు అలా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి . అయితే ఇప్పుడు బాలీవుడ్ కన్ను "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాపై పడినట్లు తెలుస్తుంది . 2025 తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 300 కోట్లకు పైగానే వసూలు క్రియేట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అంత ఈజీగా మర్చిపోకూడదు.


ఈ సినిమాలో వెంకటేష్ - ఐశ్వర్య రాజేష్ - మీనాక్షి చౌదరిల నటన బాగా ఆకట్టుకునింది . అసలు ఈ సినిమా ఇప్పటికీ జనాలు చూసి నవ్వుకుంటున్నారు అంటే వాళ్ళ యాక్టింగ్  కారణం అని చెప్పాలి. కాగా ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హిందీలో ఈ సినిమాని రీమేక్  చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట . దిల్ రాజ నిర్మాతగా కూడా వ్యవహరించాలి అంటూ చూస్తున్నారట.  అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇక్కడ ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది అంటూ చెబుతున్నారు . ఈ సినిమా తెలుగులో బాగా ఆడేందుకు వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పాటు గోదావరి యాసలో ఐశ్వర్య రాజేష్ నటన కూడా బాగా తోడ్పడింది . ఇక బుడ్డోడు రేవంత్ పర్ఫామెన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి .



అయితే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే నటులు బాలీవుడ్ లో ఉన్నారా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. గతంలో ఎఫ్2 ని బాలీవుడ్ లో తీయాలి అని దిల్ రాజు చాలా చాలా ప్రయత్నించాడు. కానీ సరైన కాంబో దొరక డబ్బింగ్ వర్షన్ తో సరిపెట్టేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఏ కోణంలో చూసిన సరే బాలీవుడ్ అస్సలు టచ్ చేయలేదు . ఎందుకు దిల్ రాజు ఇలాంటి రిస్క్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . ఇలాంటి కథలు నార్ త్ లో బోలెడు వచ్చాయి . వాళ్లు కొత్తగా ఫీల్ అవ్వరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీలో రీమేక్  చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ బాడీ మోడ్యులేషన్స్ కి వాళ్ళ టైమింగ్ కి ఈ కథ సూట్ కాకపోవచ్చు. దిల్ రాజుకి ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులు ఎందుకు హిందీలో పోగొట్టుకుంటాడు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు జనాలు.  నిజంగా ఒకవేళ దిల్ రాజు ఆ మాటలు వినకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్  చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు లాస్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి కొందరు మాత్రం ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్  చేస్తే మాత్రం అది నిజంగా పెంట పనే అని అస్సలు బాలీవుడ్ నేచర్ కి ఈ సినిమా సెట్ కాదు అంటూ మాట్లాడుతున్నారు . చూద్దాం మరి దిల్ రాజు ఏం చేస్తాడో..????

మరింత సమాచారం తెలుసుకోండి: