ఒకప్పుడు హీరోలు పాన్ ఇండియా సినిమాలు.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు.  మరి కొంతమంది మాత్రం ఎక్కువగా లవ్ స్టోరీలు రొమాంటిక్ సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు . గతంలో మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలో కూడా లవ్ సీన్స్ ను యాడ్ చేసి తెరకెక్కించిన డైరెక్టర్స్ ఉన్నారు.  అలా తెలుగు ఆడియన్స్ కి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటేనే ఎక్కుతుంది అని ఫ్యామిలీ సెంటిమెంట్ ప్లస్ లవ్  రెండు కలిస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకాలు ఎక్కువగా ఉండేటివి.


అయితే ఈ మధ్యకాలంలో మాత్రం పూర్తిగా ట్రెండ్ మారిపోతుంది . కేవలం లవ్ స్టోరీసే కాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాదు.. యాక్షన్ ద్రిల్లర్స్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలు కూడా హిట్ అవుతాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . రీసెంట్ గా పుష్ప2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం "చావా" అనే చెప్పాలి . ఒక హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా చరిత్ర సృష్టించింది .



అయితే ఎక్కువగా తెలుగు జనాలు అసలు ఈ సినిమా ఎందుకు తెలుగులో డబ్ చేయలేకపోయారు.. పనికిమాలిన పరమ చెత్త సినిమాలు అన్ని కూడా తెలుగులో డబ్ చేస్తూ ఉంటారు గా అంటూ చావా సినిమాని ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బడా స్టార్స్ కూడా హిస్టారికల్ నేపథ్యంలో అదేవిధంగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రూట్ మార్చేస్తున్నారు . ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా టోటల్ టోటల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అంటూ తెలుస్తుంది. అంతేకాదు ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఫౌజి" సినిమా కూడా అదే కాన్సెప్ట్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ -అట్లీ సినిమా నేటి సమాజంలో సైబర్ క్రైమ్ ఎలా పెరిగిపోయింది అనే విషయం కారణంగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.  ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోస్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: