టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతున్నప్పటికీ తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పటికీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం తమన్నా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు.


టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. సినిమా కథ నచ్చిన వెంటనే సినిమాల్లో విపరీతంగా నటిస్తూ బిజీగా ఉంటున్నారు. కాగా, ప్రస్తుతం తమన్న ఓదెల-2 సినిమాలో నటిస్తున్నారు. కాగా, 2022లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కరోనా సమయంలో రిలీజ్ అయింది. ఓటీటీలోను పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోయింది.


కాగా, చాలా సంవత్సరాల తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల-2 సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్న ప్రధాన పాత్రలో నటించబోతోంది. కాగా, ఓదెల-2 సినిమా టీజర్ ను మహా కుంభమేళాలో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్న డివైన్ లుక్, బిజిఎం, విఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు.


సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించారు. కాగా, త్వరలోనే ఓదెల-2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ చూసిన అనంతరం ఓదెల-2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: