
కాగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఈ పూజా కార్యక్రమాలకి హైలైట్ గా మారాయి . ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ఫస్ట్ షెడ్యూల్ అత్యంత భారీగా అట్టహాసంగా మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి . అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో లెటేస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతుంది. కాగా దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్.
తారక్ కొన్ని రోజుల తర్వాత సెట్ లో జాయిన్ అవుతారు అంటూ తెలుస్తుంది . అయితే తారక్ కు సంబంధించిన లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . తారకరక్ .. దేవర సినిమాకి ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోయే తారక్ కి చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఆయన బరువు . ఆయన ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం బాగా బరువు తగ్గినట్లు తెలుస్తుంది. రీసెంట్గా రివీల్ అయిన ఆయన లుక్స్ అదే చెప్తున్నాయి. ఎన్టీఆర్ లుక్స్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కూడా ట్రెండ్ అవుతున్నాడు . సాధారణంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫాలో అవ్వడు . తన బేసిక్ లుక్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు . కానీ ఈసారి మాత్రం చాలా స్టైలిష్ గా బాగా బరువు తగ్గిపోయి ..స్లిమ్ లుక్స్ లో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ లో వచ్చిన ఈ మార్పుని ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు..!