
నర్గీస్ ఫక్రి, టోనీ బెగ్ వివాహం అంగరంగ వైభవంగా జరుపుకోకుండా చాలా సింపుల్ గా చేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. చాలా సింపుల్ గా హోటల్ లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన అనంతరం నర్గీస్ ఫక్రి, టోనీ బెగ్ స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరు స్విట్జర్లాండ్ లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే నర్గీస్ ఫక్రి వివాహం చేసుకున్న టోని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. టోనీ బిగ్ ప్రముఖ వ్యాపారవేత్త. 2022 నుంచి నర్గీస్ ఫక్రి తోని డేటింగ్ లో ఉన్నారు. మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం వివాహం చేసుకున్నారు. టోనీ కాశ్మీర్ లో జన్మించాడు. కానీ అతను లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్నాడు. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త.
ది డియోస్ గ్రూప్ అనే దుస్తుల సంస్థకు వ్యవస్థాపకుడిగా టోనీ కొనసాగుతున్నారు. టోనీ ది డియోస్ గ్రూప్ కంపెనీని 2006 సంవత్సరంలో ప్రారంభించాడు. ఇప్పుడు అతను నర్గీస్ ను వివాహం చేసుకోవడం వల్ల టోనీ బెగ్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.