
పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ భామ పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. పూనమ్ పాండే బోల్డ్ కాంట్రవర్షియల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. 2013 సంవత్సరంలో రిలీజ్ అయిన "నషా" సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ సినిమా అనంతరం బోల్డ్ కంటెంట్ తో ఈ భామ ఓ రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన సెన్సేషన్ క్రియేట్ చేసుకుంది. నషా సినిమా అనంతరం లవ్ ఈజ్ పాయిజన్, ఆ గయా హీరో, మాలిని అండ్ కో, ది జర్నీ ఆఫ్ కర్మ వంటి అనేక సినిమాలలో నటించి మెప్పించింది. ఈ భామ నటించిన సినిమాలన్నీ మంచి హిట్ అందుకోకపోయినప్పటికీ పూనమ్ పాండే బోల్డ్ సీన్లను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపించేవారు.
ఇదిలా ఉండగా.... ఈ భామకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనమ్ పాండే తాజాగా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. అక్కడ పూనమ్ కనిపించిన సమయంలో అక్కడ ఉన్న పాపరాజ్జీలు ఫోటోలు తీయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో అక్కడ పూనమ్ అభిమాని ఒక అతను వచ్చి సెల్ఫీ ఇవ్వమని అడిగాడు. దీంతో పూనమ్ పాండే కూడా అంగీకరించింది.
ఆ వ్యక్తి నుంచి ఒక అడుగు దూరంలో పూనమ్ పాండే నిలబడి సెల్ఫీ ఇచ్చింది. కానీ ఆ వ్యక్తి పూనమ్ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. అప్పుడు పూనమ్ భయంతో ఒక్కసారిగా వెనక్కి జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపై పూనమ్ పాండే ఎలా స్పందిస్తుందో చూడాలి.