ఒక్క ఫోటో ఎన్నో జ్ఞాపకాలను ఎన్నో స్మృతులను పదిలంగా ఉంచుతుంది .. అలాగే మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుకు తెస్తుంది .. సందర్భం ఏదైనా ఒక ఫోటో ఉంటే చాలు జీవితకాలం మనకు ఓ గొప్ప మెమరీగా నిలిచిపోతుంది .. అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా చేస్తుంది .. చిత్ర‌ పరిశ్రమ లో కూడా అలాంటి జ్ఞాపకాలకు సంబంధించిన ఆసక్తికర ఫోటోల స్టోరీ మీకోసం .


ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పుష్ప రాజ్ గా భారీ జేజేలు అందుకుంటున్నారు అల్లు అర్జున్ .. గతంలో  పాలబుగ్గల తో  పైన కనిపించిన విధంగా ఇద్దరు మామల చెంతన కూర్చున్నారు .. అందులో అల్లు అర్జున్  తో పాటు మెగాస్టార్ చిరంజీవి విలక్షణ‌ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు .. అయితే మాములు అన్న బహువచనం ఏంటి అని అనుకుంటున్నారా.. అల్లు అర్జున్ కు నిజ జీవితం లో చిరంజీవి మేనమామ కాగా ప్రకాష్ రాజు కూడా పలు సినిమాల్లో అల్లు అర్జున్ కు మామగా  నటించారు .. అలా ఓ వేడుకలు రియల్ లైఫ్ , రీల్ లైఫ్ మామల తో కలిసి పాలుపంచుకున్నారు .


అలాగే రెండు దశాబ్దాల క్రితం తెలుగు నాట యువతను తన పాటలతో ఊరుత‌లు ఉగించిన పలువురు సంగీత దర్శకులు అలరించారు .. అలాంటి వారిలో ఆర్పీపట్నాయక్, చక్రి, శ్రీ, దేవిశ్రీ ప్రసాద్, ఘంటాడి కృష్ణ  కూడా ఉన్నారు .. అయితే ఈ ఐదుగురు సంగీత దర్శకులు ఒకే వేదికను పంచుకున్నారు .. అసలు విషయం ఏమిటంటే ఈ ఐదు మందిలో కొందరు కొన్నిసార్లు పలు సినిమాల్లో కనిపించారు .. అయితే వీరిలో పూర్తిస్థాయి నటుడిగా కనిపించింది మాత్రం ఆర్పి పట్నాయక్ అని చెప్పాలి .. ఆర్పి ప్రధాన పాత్రలో తెర్కక్కిన 'శ్రీను వాసంతి లక్ష్మి' సినిమా వేడుకలో ఈ ఐదుగురు సంగీత దర్శకులు పాల్గొన్నారు .. ఇలా ఆ వేడుకలొ ఈ ఐదుగురు కలిసి కనిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: