
అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది .. కానీ బాలీవుడ్ కోసం ఈ శ్రీలీల మాస్టర్ ప్లాన్ వేసుకుంది .. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంది .. అలాగే ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది .. ఇదే క్రమంలో తన కెరీర్ కు ఉపయోగపడుతుంది అనే సినిమా కోసం మాత్రం తన పారితోష్కంలో ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తూనే ఉంది శ్రీ లీల.. పెళ్లి సందడి తర్వాత ధమాకా, గుంటూరు కారం లాంటి సినిమాలకు కాస్త తక్కువగానే తీసుకున్న ఈ బ్యూటీ వైష్ణవ తేజ్ , రామ్ , నితిన్ సినిమాలుకు మాత్రం భారీగా రాబట్టుకుంది.. ఇక ఎప్పుడు బాలీవుడ్ లో కూడా ఇదే ప్లాను అమలు చేస్తుంది శ్రీ లీల.
హిందీలో తన మొదటి సినిమా కోసం కేవలం కోటి 70 లక్షలు మాత్రమే తీసుకుంటుంది .. దీనికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు .. ఈ సినిమా హిట్ అయితే శ్రీ లీలకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు .. ఇప్పటికే ముంబైలో ఈ బ్యూటీ గురించి భారీగా చర్చ జరుగుతుంది .. అలాగే నెక్స్ట్ బాలీవుడ్ లో కాబోయే బిగ్ స్టార్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ గురించి బెట్టు చేస్తే తర్వాత వచ్చే ఆఫర్స్ కూడా రావు అందుకే అక్కడ సక్సెస్ అయిన తర్వాత డబ్బులు వస్తాయని ఈమె ఫిక్స్ అయింది. పైగా గ్లామర్ షోకు కూడా శ్రీలీల పెద్దగా నో చెప్పటం లేదు .. అందుకే ఫ్యూచర్లో అక్కడ అంతా మనదే అనే నమ్మకంతో ప్రస్తుతం తక్కువ తీసుకున్న .. తర్వాత వడ్డీతో కలిపి తీసుకోవచ్చు అనే భారీ ప్లాన్ లో ఉంది శ్రీ లీల.