రష్మిక విజయ్ దేవరకొండపెళ్లి గురించి ఎన్నో వార్తలు ఊరిస్తున్నాయి. కానీ ఇప్పటివరకైతే వారి పెళ్లి జరగలేదు.అయితే అఫీషియల్ గా మేము నిజంగానే ప్రేమలో ఉన్నాం పెళ్లి చేసుకుంటున్నాం అని బయట పెట్టలేదు కానీ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లకి వెళ్తూనే ఉన్నారు. అయితే తాజాగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ల గురించి ఓ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్మిక కి విజయ్ కండిషన్ పెట్టడం వల్లే ఇద్దరూ పెళ్ళికి దూరం అవుతున్నారు అంటూ మాట్లాడారు. మరి ఇంతకీ ఈ మాటలు మాట్లాడిన ఆ డైరెక్టర్ ఎవరంటే గీతాకృష్ణ.. ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఈయన ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేక పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ నటీనటులపై డైరెక్టర్లపై నిర్మాతలపై కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

అయితే అలాంటి గీతాకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్నా విజయ్ దేవరకొండల మధ్య ప్రేమ ఉన్నది నిజమే.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి గురించి చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఈ జంట సుముఖంగా లేరని తెలుస్తోంది.ముఖ్యంగా రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంటే విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం అంత బాగాలేదు. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ ఫామ్ లోకి వచ్చి మళ్లీ సినీ ఇండస్ట్రీలో మొత్తం సెట్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని రష్మిక కి కండిషన్ పెట్టారట.

ఇక ఈ కండిషన్ కి ఒప్పుకున్న రష్మిక కూడా పెళ్లికి తొందరేం లేదని నువ్వు ఇండస్ట్రీలో నీలాదొక్కుకున్నాకే చేసుకుందాం అని. దాంతో ఈ కండిషన్ వల్లే రష్మిక మెడలో విజయ్ దేవరకొండ తాళి కట్టడం లేదని,విజయ్ దేవరకొండ ఫామ్ లోకి రావడంతోనే వీరి పెళ్లి జరగడం ఖాయం అంటూ గీతాకృష్ణ వీరి పెళ్లి గురించి జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. ఇక రీసెంట్ గానే రష్మిక ఛావా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి కింగ్ డమ్ మూవీ అయిన విజయ్ దేవరకొండ కి మళ్ళీ మునపటి వైభవం తెచ్చిపెడుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: