
మెగా హీరోలు పవన్ కళ్యాణ్ వెంట ఉండడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు .. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు .. తమలో ఒక హీరో రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ చక్రం తిప్పుతున్నాడు అంటూ గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నారు .. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి తెలుగు ఇండస్ట్రీకి తమవంతు సయం అందించడానికి ఎప్పుడు ముందుంటానంటున్నారు.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా జనసేన గురించి గానీ పవన్ కళ్యాణ్ గురించి గానీ ఎక్కడా బయట మాట్లాడలేదు .. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం అందరిలో మాట తీరు మారిపోయింది .. ఏకంగా సినిమా ఈవెంట్స్ లో కూడా .. 30 ఇయర్స్ పృథ్వి , హైపర్ ఆది లాంటివాళ్ళు పాత ప్రభుత్వంపై భారీ పంచులు వేస్తూ కొత్త ప్రభుత్వంపై అందులోనూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
మొన్న ఎన్నికల సమయంలో టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు అనటంలో ఎలాంటి సందేహం లేదు . పైగా ఎన్నికల ప్రచారంలో దీన్ని కూడా ఒక ప్రచార అస్తంగా వారు కొన్నారు పవన్.. మహేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఇల చాలామంది హీరోల పేర్లు పవన్ తన ప్రచారంలో పదేపదే వాడుకున్నారు .. అవి కూడా ఓట్ల రూపంలో జనసేనకు బాగా కన్వర్ట్ అయ్యాయి. అలాగే సినిమా వాడు కాబట్టి పవన్ మామడు అంటూ అందరూ అక్కున చేర్చుకుంటున్నారు .. అయితే ఈ సపోర్ట్ ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.