
ఇక ఫోన్ లేకుండా ఇప్పుడు జీవించడం అంటే దాదాపు ఒంటరిగా ఏకాంతంగా బతికినట్టే .. ఆ అనుభవం నాకు చాలా భయంకరంగా ఉంటుంది కానీ నా జీవితంలో ఇలాంటి రోజులు నేను ఎన్నో గడిపాను .. ఒంటరిగా గడిపిన ఆ క్షణాలు చాలా భయంకరం కానీ ఇలాంటివి ఎదుర్కొనేందుకు నాకు ఎంతో ధైర్యం ఉంది .. అలాగే ఇలాంటి రోజులు లక్షసార్లు గడపడానికి కూడా నేను రెడీగా ఉన్నానంటూ పోస్ట్ చేసింది సమంత .. అయితే ఇప్పుడు సమంత పెట్టిన ఈ పోస్ట్ ఎంతో వైరల్ గా మారింది .. నాగచైతన్యతో విడాకులు తర్వాత నిజానికి చైతన్య జీవితంలో నుంచి పక్కకు వెళ్ళిపోయాడు .. అలాగే రీసెంట్ గానే మరో హీరోయిన్ శోభితతో పెళ్లి చేసుకుని మరో ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టాడు.
సమంత మాత్రం చాలాకాలం అదే బాధలో ఉంది .. ఇదే క్రమంలో మయోసైటిస్‌ను కూడా ఈమెను ఎంతగానో ఇబ్బంది పెట్టి చాలాకాలం మీడియా ముందుకు రాలేకపోయింది .. అలాగే సినిమా ప్రమోషన్ లో కూడా పెద్దగా కనిపించలేదు .. చైతన్యతో విడిపోయిన ఆ రోజులు తలుచుకొని సమంత ఈ పోస్ట్ పెట్టిందని అభిమానులు అంటున్నారు .. ఇలాంటి రోజులు ఎన్నైనా గడిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ సమంత ఇచ్చిన స్టేట్మెంట్ను వారు మెచ్చుకుంటున్నారు .. అలాగే జీవితంలో ఎన్ని జరిగినా ధైర్యం కోల్పోకుండా ముందుకు పోరాడాలంటూ తమ ఇష్టమైన హీరోయిన్ కు ధైర్యం చెబుతున్నారు.
