బాలీవుడ్ లో వచ్చిన రాక్ స్టార్ సినిమాతో ఊహించని విధంగా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి .. ఆ తర్వాత వర‌సుగా మద్రాస్‌ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3.. వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది .. అలాగే హాలీవుడ్ సినిమా స్పైలోను ఈమె నటించింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో చేస్తుంది .. అలాగే ఈ సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ లో నిలుస్తూ వస్తుంది నర్గీస్..అయితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ రహస్యంగా పెళ్లి చేసుకుందని అంటున్నారు.. అలాగే ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నటి నర్గీస్ ఫఖ్రీ లాస్ ఏంజెల్స్ లో పెళ్లి చేసుకుంది .. అలాగే ఈ పెళ్లి ఎంతో ప్రైవేట్ గా జరిగిందని ఆమె వివాహానికి కేవలం సన్నిహితులు కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లారట .. ఇలా అతికొద్దీ మంది సమక్షంలో నర్గీస్ టోనీని.... పెళ్లి చేసుకుంది .. అయితే ఈ పెళ్లి గురించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. అలాగే ఈ పెళ్లి తర్వాత ఈ జంట త‌మా హనీమూన్ కోసం స్విజర్లాండ్ కూడా వెళ్లారట. అయితే ఇప్పుడు నర్గీస్ ఫక్రీ, టోనీ 2022 నుంచి డేటింగ్ లో ఉంటున్నారు .. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత వీరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.. నర్గీస్ భర్త విషయానికి వస్తే .. టోనీ కాశ్మీర్లో జన్మించాడు కానీ ఈయన ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాడు .. ఇతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త..


 ‘ది డియోస్ గ్రూప్’ అనే బట్టలు వస్తువుల సంస్థ  వ్యవస్థాపకుడుగా కొనసాగుతున్నాడు .. అలాగే టోనీ ఈ కంపెనీని 2006లో మొదలుపెట్టాడు.. ఇక ఇప్పుడు ఇతను నర్గీస్‌ను  పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇక నర్గీస్  బాలీవుడ్ లో ఎంతో పాపులర్ హీరోయిన్ .. ఇక ఈమె 2011లో డైరెక్టర్ ఇంతియాజ్ ఆలీ తెర్కక్కించిన ‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈమె బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు జంటగా నటించింది .. ఇక ఈ సినిమా  సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారం కూడా జరిగింది .. అయితే ఇప్పుడు నర్గీస్ పెళ్లి వీడియోస్ సోషల్ మీడియాలో  వైరల్ గా  మారింది దీంతో ఈమెకు సంబంధించిన అనేక విషయాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: