తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు తీసినటువంటి సినిమాలు వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి. ఎప్పుడు ఆ సినిమా చూసిన డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చేశారని తప్పనిసరిగా గుర్తు చేసుకుంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నూతన ఒరవడిని నేర్పినటువంటి డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు.. ఈయన డైరెక్షన్ చాలా స్పెషల్ గా ఉంటుంది.. అలాంటి అమ్మోరు అరుంధతి వంటి చిత్రాలను తీసుకువచ్చి  ప్రతి ప్రేక్షకున్ని భక్తి భావం వైపు తిరిగేలా చేశారు.. ఇలాంటి కోడి రామకృష్ణ పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో వాడే ఎఫెక్ట్స్ ను ఆ రోజుల్లోనే పరిచయం చేశారని చెప్పవచ్చు.. అలాంటి ఈయన చనిపోయి 6 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు చూద్దాం.. 

కోడి రామకృష్ణను చూడగానే చాలామందికి గుర్తుకు వచ్చేది తన తలకు కట్టుకున్న తలకట్టు.. ఆ తెల్లని వస్త్రం తలకు ఎందుకు కట్టుకుంటారో అని చాలామందికి తెలియదు.. దాని వెనుక పెద్ద రహస్యం ఉందట.. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు కోడి రామకృష్ణ.. తరంగిణి సినిమా చేసే సమయంలో షూటింగ్ స్పాట్లో సీనియర్ ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ రామారావు కోడి రామకృష్ణ దగ్గరికి వచ్చి మీ నుదురు చాలా పెద్దగా ఉంది.. ఎండ బాగా కొడుతోంది. నుదుటికి ఏదైనా కట్టు కట్టుకోండి అని చెప్పారట.. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక తెల్లని కర్చీఫ్ తీసి కోడి రామకృష్ణ నుదుట కట్టారట.. ఆ వస్త్రాన్ని కట్టగానే ఆరోజు అంతా రామకృష్ణ షూటింగ్లో చాలా హుషారుగా పనిచేశారట..

 ఇదేదో వింతగా ఉందని మరుసటి రోజు ఒక తెల్లని బ్యాండు ప్రత్యేకంగా తయారు చేసుకొని మరీ ఆయన కట్టుకున్నారట. అప్పటినుంచి సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా అవ్వడమే కాకుండా సరికొత్త ఎనర్జీ రామకృష్ణకు వచ్చినట్టు అనిపించిందట.. ఆయనకు తెల్లని వస్త్రం నుదుటిపై కట్టుకోవడం ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుంచి ఆయన మరణించే వరకు నుదుటికి తెల్లని వస్త్రాన్ని కట్టుకోవడం మాత్రం మర్చిపోలేదట.. ఇక ఇదే కాకుండా చేతివేళ్ల అన్నింటికీ ఉంగరాలు కూడా ధరించి చాలా డిఫరెంట్ గా కనిపించే వారని ఆయనను దగ్గరి నుంచి చూసిన సన్నిహితులు అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: