
ప్రతి సినిమాకి కూడా తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది రష్మిక. అలా ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి అవలీలగా మారిపోతోంది. యానిమల్ సినిమాలో రొమాంటిక్ పాత్రలో నటించగా పుష్ప చిత్రంలో మాస్ పాత్రలో నటించగా ఛావా సినిమాలో మరింత అద్భుతమైన పాత్రలో నటించింది. అలా రష్మిక ప్రతి సినిమాతో కూడా పాన్ ఇండియన్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. ఏసుభాయి పాత్రలో బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలను కూడా పక్కకి నెట్టేసిందట. దీంతో ప్రస్తుతం రష్మిక పరిస్థితి చూస్తే ఈ అమ్మడిని ఇప్పట్లో టచ్ చేసి హీరోయిన్ కూడా లేదని ఈమెకు పోటీగా మరొక హీరోయిన్ కూడా రావడం సాధ్యం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆలియా భట్ మాత్రం రష్మికని బీట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇక సాయి పల్లవి కూడా ప్రస్తుతం రామాయణం అనే చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే తప్ప తన నటన ఎలా ఉందనేది ప్రూఫ్ అవ్వదు.. మరి రష్మికకు పోటీకి సాయి పల్లవ లేకపోతే ఆలియా భట్ అన్న విషయం తదుపరి చిత్రాల విడుదలను బట్టి అది ఖాయం అవుతుంది. మొత్తానికి అటు కోట్లల్లో సంపాదిస్తూ భారీగానే పేరు సంపాదించింది రష్మిక.