టాలీవుడ్ లో నటిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది ధన్య బాలకృష్ణ.. మొదటిసారి 7అయ్ ఆరివు  అనే చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నేను శైలజా సినిమాలో కొంతమేరకు పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ సినిమా కొంతమేరకు పరవాలేదు అనిపించుకున్నది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది ధన్య బాలకృష్ణ.


ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తను నటించిన బాపు సినిమా ఇటీవలే విడుదలయ్యింది. ఇందులో అవసరాల శ్రీనివాస్ కూడా కీలకమైన పాత్రల కనిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ధన్య తన సోషల్ మీడియా వేదికగా గొర్రెలు మేపుతున్న ఒక వీడియోను సైతం షేర్ చేయడం జరిగింది. ధన్య నటించిన బాపు సినిమా చూడాలని ప్రేక్షకులను కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేస్తే అది చూసిన నెటజన్స్ సైతం సినిమా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నావా ధన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే ట్రెండ్  కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ అందరూ ముందుకు వెళ్తున్నారు. అందుకోసమే చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ తమ సినిమాల ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. ధన్య కూడా ఇదే వాటిని ఫాలో అయినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి గొర్రెలు మేపుకుంటున్న ధాన్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని అందించిందేమో చూడాలి మరి. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి ధన్య బాలకృష్ణ. మరి రాబోయే రోజుల్లో హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు అందుకొని సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: