టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సీనియర్ హీరో రజనీకాంత్ ఒకరు. యంగ్ ఏజ్ నుంచి ఇప్పటివరకు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంటారు. రజినీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రజనీకాంత్ జైలర్-2 సినిమా విషయం గురించి అనౌన్స్ చేశారు. 

తాజాగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్, సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ సినిమా కథను వినిపించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే రజనీకాంత్ ఈ సినిమా గురించి ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని పూర్తి స్క్రిప్ట్ తో మరోసారి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పైన అధికారికి సమాచారం రానున్నట్లుగా సమాచారం అందుతుంది దీంతో ఇప్పుడు కొంతమంది. ఈ విషయం తెలిసిన అనంతరం తలైవా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. రజినీకాంత్ మారన్ తో సినిమా చేయడం సరైనది కాదేమోనని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమాకు అసలు ఓకే చెప్పొద్దని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వెట్రి మారన్ రజనీకాంత్ వంటి దర్శకులు తమ ప్రోపగాండాను సినిమాలలో చూపిస్తారని వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాటి వల్ల రజనీకాంత్ కు ఎలాంటి లాభం ఉండదని అంటున్నారు.


పా రంజిత్ తో కలిసి కాలా, కబాలి వంటి రెండు సినిమాలలో రజనీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే మారి సెల్వరాజుతో రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మారన్ తో పని చేస్తారని సమాచారం అందడంతో రజనీకాంత్ అభిమానులు అలా చేయొద్దని సూచనలు చేస్తున్నారు. మరి దీని గురించి రజనీకాంత్ ఈ విషయంపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: