ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక అలా  థియేటర్లలో రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే నేడు సినిమా లవర్స్ కి పండగే పండగ అని చెప్పాలి. 
 
ఎందుకంటే ఈ రెండు రోజుల్లోనే ఏకంగా 19 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అయితే వాటిలో నేడు 13 స్పెషల్ సినిమాలు విడుదల కాగా 4 మాత్రమే తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ప్రస్తుతం థియేటర్ లలో విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ, బ్రహ్మ ఆనందం తెరకెక్కించిన బ్రహ్మ ఆనందం సినిమా, ఇట్స్‌ కాంప్లికేటెడ్‌ సినిమా, తల సినిమా, అలాగే విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా సినిమాలు ఆడుతున్నాయి.

 
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. నెట్ ఫ్లిక్స్ లో జీరో డే వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. దీంతో పాటుగా సీఐడీ సీజన్ 2, పాంథియాన్ సీజన్ 2, డాకూ మహారాజు కూడా స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. అమెజాన్  ప్రైమ్ ఓటీటీలో బేబీ జాన్ సినిమా, రీచార్ సీజన్ 3 స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈటీవీ వీన్ ఓటీటీలో సమ్మేళనం వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఆహాలో మార్కో సినిమా, బాటిల్ రాధ సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో క్రైమ్ బీట్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఊప్స్! అబ్ క్యా?, ఆఫీస్ వెబ్ సిరీస్, కౌశల్ జీస్ వర్సెస్ కౌశల్, బ్యూరీడ్ హార్ట్స్ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఆపిల్ ప్లస్ టీవీలో సర్ఫేస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవ్వనుంది. టెంట్ కోట ఓటీటీలో వనంగాన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక హోయ్‌చోయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చాల్ చిత్రో ది ఫ్రేమ్ ఫాటల్ సినిమా విడుదల కానుంది. సింప్లీ సౌత్ ఓటీటీలో సెల్ఫీ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: