ఈషా రెబ్బ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడలింగ్ రంగంలో తన అంద చందాలను ఆరబోసి తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ముఖ్యంగా ఈషా రెబ్బ అనేక బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించింది. ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఫేమస్ అయిన అనంతరం "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమాతో నటిగా తనకు తాను పరిచయం చేసుకుంది. అనంతరం "అంతకుముందు ఆ తర్వాత" అనే సినిమాతో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

తెలుగు అమ్మాయి కావడంతో ఈ బ్యూటీని ప్రేక్షకులు అతి తక్కువ సమయంలోనే ఆదరించారు. తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. బందిపోటు, దర్శకుడు, అమీ తుమీ, ఆ!, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో లాంటి అనేక సినిమాలలో నటించింది. అయితే ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ రెండు మూడు సినిమాలు మాత్రమే ఈ బ్యూటీకి మంచి విజయాలను అందించాయి.


కొన్ని సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈషా రెబ్బా ఏ మాత్రం వెనుతిరగకుండా వరుసగా సినిమాలలో నటిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ పలకరిస్తూ ఉంటుంది. కాగా, ఈషా రెబ్బకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ అవి అన్ని చిన్న సినిమాలే కావడం విశేషం. భారీ ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకోలేకపోతోంది.


అయితే ఈ బ్యూటీకి సంబంధించి ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఈషా రెబ్బ రాత్రి అయితే చాలు రొమాన్స్ సినిమాలు చూసి పడుకుంటుందట. ఆ సినిమాలు చూడకపోతే తనకు అసలు నిద్ర పట్టదట. ప్రతిరోజు రాత్రి రొమాన్స్ సినిమాలు చూసిన తర్వాత నిద్రపోతుందట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: