
ఈ సినిమా ఎంతగానో ప్రేమించుకున్న ఒక జంట ఎడబాటుకు గురి అయితే పడే బాధను, ప్రేమను ప్రతిబింబిస్తుంది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాత్రలు, నటన చాలా సహజంగా ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల నటనతో పాటు DSP అందించిన అద్బుతమైన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక బ్యాక్ బోన్ గా మారింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అందుకుంది.
అయితే నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ కి వెళ్లారు. అక్కడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న చిన్నారులను కలిశారు. వారితో సరదాగా మాట్లాడి, కాస్త సమయం వారికి కేటాయించి.. దైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.