
ఈ మిరాయ్ సినిమా షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 1న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అదే నెలలో కనప్ప, అలాగే రాజా సాబ్ సినిమాల రిలీజ్ ఉండడంతో టీమ్ ఇప్పుడు సినిమా రిలీజ్ ని ఆగస్ట్ నెలకి మార్చింది. ఈ సినిమా.. సూపర్ యోధ అనే క్యాప్షన్ తో వస్తుంది. ఈ సినిమా మరోసారి తేజా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా హనుమాన్ సినిమాలనే ప్రేక్షకులను మెప్పిస్తోందని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నట్లు.. తేజా, మంచు మనోజ్ కి యాంటీగా నటిస్తున్నట్లు సమాచారం
మిరాయ్ సినిమాలో తేజా సజ్జా, మనోజ్ మధ్య యాక్షన్ సీన్ లు మామూలు ఉండవని తెలుస్తోంది. మంచి పవర్ ఫుల్ ఫైట్ ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది. సినిమాల ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చెప్పారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతుంది. మిరాయ్ సినిమాలో తేజాకి జోడీగా హీరోయిన్ రితికా నాయక్ నటిస్తుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన డేట్, సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.