
ఇక ఈ రీరిలీజ్ మూవీస్ తో మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఈ సారి రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాలతో పాటు రీరిలీజ్ కి ఓల్డ్ మూవీస్ కూడా రెఢీ అయ్యాయి. అయితే రిలీజ్ అయ్యి సందడి చేసే రీరిలీజ్ మూవీస్ లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి మూవీ వచ్చే నెలలో రీరిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఒక్క మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ రీరిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మాత్రం మంచి హిట్ కొడుతుంది. గోదావరి అందాలను తెరపైన చక్కగా చూపిస్తూ ఈయన తీసిన సినిమా గోదావరి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ నటించారు. ఈ సినిమా చూసినంత సేపు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పటికే సనమ్ తేరి కసమ్ మూవీ కూడా రీరిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇక శివరాత్రికి బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా రీరిలీజ్ అవ్వనుంది.