ఈ మధ్యకాలంలో థియేటర్లలో రీరిలీజ్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇక ఈ రీరిలీజ్ మూవీస్ తో మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఈ సారి రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పుడు రీరిలీజ్ కి రెడీగా ఉన్న ఓల్డ్ మూవీస్ లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
 
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి మూవీ వచ్చే నెలలో రీరిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఒక్క మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ నటించారు. ఇక శివరాత్రికి బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా రీరిలీజ్ అవ్వనుంది. అలాగే మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హీరో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే మార్చి 21న రిలీజ్ అయ్యే ఎవడే సుబ్రమణ్యం సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

 
ఈ సినిమాని కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ముఖ్యపాత్రలో నాని కనిపిస్తారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 10 ఏళ్లు కావస్తుంది. అయినప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఎవరికి తెలీదు. కానీ ప్రస్తుతం విజయ్ టాప్ హీరోలలో ఒకడు. దీంతో నాని కంటే కూడా విజయ్ కోసమే ఎక్కువ మంది వెళ్తారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ కారణంగా నాని, విజయ్ ల మధ్య ఫ్యాన్ వార్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: