చిరంజీవి కథానాయకుడిగా నానిసినిమా నిర్మించనున్నారు. 'దసరా' ఫేం శ్రీకాంత్‌ ఓదెల  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్లు వచ్చాయి.అయితే విశ్వంభర మూవీ తర్వాత చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల  డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారని ,ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే తాజాగా శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నాని. మరి ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది.. ? నాని ఏం చెప్పారు? అనేది ఇప్పుడు చూద్దాం.నాని ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాణ రంగంలో కూడా స్థిరపడుతున్నారు. ఆయన తన వాల్ పోస్టర్ బ్యానర్ పై ఇప్పటికే పలు చిన్న సినిమాలు నిర్మించి హిట్ కొట్టారు. తక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. అయితే అలాంటి నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్ట్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్టు మూవీ మార్చి 14న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు నాని.

ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతున్నారు. అలా తాజాగా కోర్టు మూవీ ప్రెస్ మీట్ లో నానికి శ్రీకాంత్ ఓదెల,చిరంజీవి సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురవ్వగా గుడ్ న్యూస్ చెప్పారు.నాని మాట్లాడుతూ మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవిశ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు త్వరలోనే స్టార్ట్ అవుతుంది.ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు” క్లారిటీ ఇచ్చారు నాని.అయితే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాని నాని తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవల హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను తెరకెక్కించారు దర్శకుడు వశిష్ట. ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్‌లో ఉన్న అనిల్‌ ప్రస్తుతం చిరు చిత్రం కథా చర్చల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: