సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 29వ సినిమాకు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నా సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు.భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయబడతుందని చెప్తున్నారు. ఈ సినిమాను రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాప ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాతో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి రాజమౌళి ఇచ్చిన వార్నింగ్ ఏంటి అసలు ఎందుకు తనని హెచ్చరించారనే విషయానికి వస్తేస్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మహేష్ బాబు సినిమాల పరంగా చాలా నిబద్ధతతో పనిచేస్తారట ఎలా అంటే సినిమాలలో ఎలాంటి యాక్షన్ సన్ని వేషాలు అయినా కూడా డూప్ లేకుండా తానే నటించే అలవాటు మహేష్ బాబుకి ఉందట. 

ఈ విషయంలో గతంలో కూడా కృష్ణ ఎన్నోసార్లు తనని హెచ్చరించిన మహేష్ మాత్రం తన ధోరణిని మార్చుకోలేదు.అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే అభిమానుల నుంచి, ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది. హీరోకు దెబ్బ తగిలి షూటింగ్ ఆగిపోతే ఇతర నటుల కాల్షీట్లన్నీ వృథా అవడంతోపాటు మరోసారి వారి కాల్షీట్ల కోసం, ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువవుతుంది.ఈ నేపథ్యంలోనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ దూకేశాడు. ఇదే సమయంలో, మహేష్ బాబును ఒక దూకుడు సన్నివేశం తీసే సమయంలో డూప్ అవసరం అని చెప్పిన రాజమౌళి, తన మొండిపట్టుని మార్చాలని సూచించాడు. ఇటువంటి రాజమౌళి దృష్టిలో ఉంచుకొని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరిక జారీచేశాడు. ఇటువంటివన్నీ మానుకోవాలని, కొన్ని సన్నివేశాల్లో డూప్ ను పెట్టక తప్పదని, నేనే నటిస్తానంటూ మొండిపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరుకదా. మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారు. సినిమా సన్నివేశాల్లో ప్రమాదకరమైన యాక్షన్ చేయడానికి డూప్ తప్పనిసరిగా అవసరమని రాజమౌళి చెప్పాడు. నేను సినిమాను కేవలం వాస్తవికంగా, సురక్షితంగా రూపొందించాలి అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: