టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది హీరోయిన్లు తెలుగు వారి కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా తమిళ, మలయాళ, కన్నడ హీరోయిన్లు చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వారి సత్తాను చాటుతున్నారు. తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. కొంతమంది స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా రాణించిన వారే ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు లేక వేరే భాషలలో సినిమాలు చేస్తున్నారు. 

అలాంటి వారిలో పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే ఒకరు. ఈ భామ ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది వరుసగా సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా రాణించింది. ముఖ్యంగా అల వైకుంఠపురం సినిమాలో ఈ చిన్నదాని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఆ సినిమా అనంతరం పూజ హెగ్డేకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి పూజా హెగ్డే తెలుగులో ఎలాంటి సినిమాలు చేయకపోవడం నిజంగా బాధాకరం.


మహానటి కీర్తి సురేష్ కూడా తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈ భామ నటించిన ఆఖరి చిత్రం బోలా శంకర్. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత కూడా ఈ జాబితాలో చేరారు. తెలుగులో ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన నటించిన ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు.

ఖుషి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమాలోను నటించలేదు. ప్రస్తుతం సమంత టాలీవుడ్ సినీ పరిశ్రమకు దాదాపుగా దూరమైనట్లే వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో నటి నిత్యమీనన్ ఒకరు. క్యూట్ గా, అందంగా కనిపించే ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. భీమ్లా నాయక్ సినిమా అనంతరం తెలుగులో ఇతర ఏ సినిమాలోను నిత్యమీనన్ నటించలేదు. ఈ నలుగురు హీరోయిన్లు తెలుగులో ఎలాంటి సినిమాలు చేయకుండా ఇతర భాషలలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: