యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెప్పరు. కథ ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే తారక్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వార్2 సినిమాలో తారక్ పోషించే పాత్ర చిన్నదే అని వార్తలు వినిపించినా ఆ పాత్ర నిడివి అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా వార్2 సినిమా నిలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు హృతిక్, తారక్ కాంబో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. వార్2 సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చరిత్ర తిరగరాయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
వార్2 సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ తో పోల్చి చూస్తే బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాలో ప్రతి సన్నివేశం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఫీలింగ్ ను కలిగించడం పక్కా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
 
వార్2 సినిమా ఇతర భాషల్లో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. వార్2 సినిమా అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. వార్2 సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి. వార్2 సినిమా 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. మార్చి నుంచి తారక్మూవీ షూట్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: