ఏంటి కార్తికేయ సినిమాహీరో సినిమాకి నిజంగానే కాపీనా..మరి కాపీ అయితే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అని కొంతమందిలో కొన్ని అనుమానాలు అయితే  ఉంటాయి. మరి ఇంతకీ కార్తికేయ సినిమా ఏ సినిమాకు కాపీయో ఇప్పుడు చూద్దాం.. ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మూవీ దర్శకుడు ప్రస్తుతం పలు ప్రమోషన్స్లో పాల్గొంటూ ఎన్నో విషయాలు బయట పెడుతున్నారు.ఇక ఈ మూవీ డైరెక్టర్ చందు మొండేటి గతంలోనే మంచి మంచి సినిమాలు తీశారు. అలాగే కార్తికేయ సినిమాతో కార్తికేయ -2 వంటి పాన్ ఇండియా మూవీ కూడా తీశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందు మొండేటి  కార్తికేయ, కార్తికేయ టు రెండు మూవీలు ఆ హీరో సినిమాకి కాపీ..అది ఎవరు బయట పెట్టలేదు.కానీ నా భార్య పసిగట్టేసింది అంటూ మాట్లాడారు. 

ఇక విషయంలోకి వెళ్తే..చందు మొండేటీ కార్తికేయ,కార్తికేయ 2 సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలను ఖలేజా సినిమాని ఇన్స్పిరింగ్ గా తీసుకొని తీసారట.అలాగే ఖలేజాలో పెట్టిన కొన్ని సీన్స్ ని ఆధారంగా చేసుకొని కార్తికేయ, కార్తికేయ టు రెండు మూవీలను తెరకెక్కించారట. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ బయట పెట్టలేకపోయారు. కానీ చందు మొండేటి భార్య ఓ రోజు టీవీలో ఖలేజా మూవీ చూసి అమ్మదొంగ దొరికిపోయావు.. నువ్వు ఖలేజా మూవీ నుండి నీ రెండు సినిమాలను కాపీ కొట్టావు అని పట్టుకుందట.అయితే ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి చెప్పారు.ఇక ఖలేజా మూవీలో మహేష్ బాబు ఎలా అయితే ముందు జరిగేవన్నీ ఊహిస్తాడో కార్తికేయ సినిమాలో కూడా నిఖిల్ అలాగే చేస్తారు. 


అయితే ఖలేజా మూవీలో హీరో హీరోయిన్ కలిసినప్పుడు ఏదో డిజాస్టర్ జరుగుతుంది.కానీ ఇక్కడ మాత్రం ఆపోజిట్ గా తీసుకున్నారు. అలా ఖలేజా మూవీలోని కొన్ని సన్నివేశాలను ఇన్స్పైరింగ్గా తీసుకొని కార్తికేయ,కార్తికేయ టు రెండు మూవీలను తెరకెక్కించాను అంటూ చందు మొండేటి చెప్పుకొచ్చారు. ఖలేజా మూవీలోని కొన్ని సీన్స్ ని తన కథకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రాసుకున్నారట. అయితే ఖలేజా మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి చేసిన రెండు సినిమాలు హిట్ అయితే ఖలేజా మూవీ మాత్రం భారీ ఫ్లాఫ్ అయింది.అయితే ఈ సినిమా థియేటర్లో మాత్రమే డిజాస్టర్ అయింది.టెలివిజన్లో ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు

మరింత సమాచారం తెలుసుకోండి: