టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ద్వారా తారక్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించి మరో విజయాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం తారక్ "వార్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు  ఇకపోతే చాలా రోజుల క్రితమే తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోయినా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు దీనినే కన్ఫామ్ చేసి మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ , తారక్ పెద్ద మొత్తంలో పారితోషకాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మూవీ కోసం ప్రశాంత్ నీల్ 200 కోట్లు , తారక్ 120 కోట్ల పారితోషకాలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఈ సినిమాకు పెద్ద టార్గెట్ ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ సినిమా పెద్ద టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: