ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించే సౌందర్యను కూడా భయపెట్టిన సినిమా ఒకటి ఉందట. ఆ సినిమాకు భయపడి చిత్రహింసలు అనుభవించి చివరికి సినిమానే వదిలేద్దాం అనుకుందట సౌందర్య.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి.. సౌందర్యను అంతలా భయపెట్టిందా అనేది ఇప్పుడు చూద్దాం. సౌందర్యను భయపెట్టి చిత్రహింసలకు గురి చేసిన ఆ సినిమా ఏదో కాదు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన అంతఃపురం.. ఈ సినిమా అప్పట్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు అయితే ఇది ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వైల్డ్ నేస్ ని కోరుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలో చాలా వైల్డ్ గా చూపించారు కృష్ణవంశీ. అప్పట్లోనే ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి.సాయికుమార్ భార్యగా సౌందర్య ఈ సినిమాలో నటిస్తుంది. 

అలాగే ప్రకాష్ రాజ్ సాయికుమార్ తండ్రి పాత్రలో జగపతిబాబ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో రాయలసీమలో ఎలా అయితే ఉంటాయో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. కానీ సౌందర్యకు మాత్రం అవన్నీ నచ్చవు. మనుషుల్ని చంపడాన్ని హింసను వ్యతిరేకిస్తుంది. ఇక వాళ్ళు సౌందర్య చెప్పిన మాటలు వినకపోవడంతో తన బాబుని తీసుకొని కుటుంబానికి దూరంగా వెళ్లిపోవాలనుకుంటుంది.కానీ అలా వెళ్లే సమయంలో కుటుంబం అడ్డుకుంటుంది. అలా కథ మొత్తం సౌందర్య చుట్టే తిరుగుతుంది. అయితే సినిమా కోసం సౌందర్య చాలా కష్టపడిందట. ముఖ్యంగా టార్చర్ కూడా అనుభవించిందట. ఎందుకంటే ఈ సినిమాలోని చాలా సన్నివేశాలలో సౌందర్యను కొడతారు.

 కొన్నిసార్లు నిజంగానే సౌందర్యకు దెబ్బలు తగిలాయట. ఇక ఈ టార్చర్ అంతా భరించలేని సౌందర్య సార్ నేను వెళ్ళిపోతాను.  ఈ సినిమా చేయడం నావల్ల కాదు అని కృష్ణ వంశీకి చెప్పిందట.కానీ కృష్ణవంశీ మాత్రం కథంతా నీ చుట్టే తిరుగుతుంది .ఈ సినిమా విడుదలయితే నీకు మంచి గుర్తింపు వస్తుంది. మధ్యలో అస్సలు వదిలేయొద్దు అని చెప్పారట. ఇక డైరెక్టర్ అంతగా చెప్పడంతో చేసేదేమీ లేక మధ్యలో సినిమా వదిలేస్తే నిర్మాతకు నష్టం వస్తుంది అని గ్రహించిన సౌందర్య ఎలాగొలా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. అలా సినిమా షూటింగ్ కంప్లీట్ అయి విడుదలయ్యాక సినిమా భారీ హిట్ అయింది.అప్పట్లోనే ఈ సినిమాకి 9 అవార్డులు వచ్చాయి. అలా ఎన్నో అంచనాలతో వచ్చిన అంతఃపురం సినిమా హిట్ అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య మాత్రం చాలా చిత్రహింసలు అనుభవించిందట

మరింత సమాచారం తెలుసుకోండి: