పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి. వాటిలో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది.... ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..

దర్శకుడు హనురాఘవపూడి ఈ సినిమాలో ప్రభాస్ ని ఫ్యాన్స్ ఇప్పటి వరకు చూడని పాత్రలో చూపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించలేదు. కాబట్టి ఈ పాత్ర ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు..దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రం “ సీతారామం “ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. యుద్ధంతో కూడిన ప్రేమ కథను చూపించి ప్రేక్షకులకి అద్భుతమైన అనుభూతి కలిగించాడు.. 

ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే సినిమా కూడా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ప్రేక్షకులకి షాక్ ఇస్తుందని సమాచారం.. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు..ప్రస్తుతం ప్రభాస్ “ఫౌజీ” సినిమాకు అధికంగా డేట్స్ కేటాయించాడు.. త్వరలోనే ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబో సెన్సేషనల్ మూవీ “స్పిరిట్” సైతం షూటింగ్ ప్రారంభం కానుంది.. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ లో వున్నారు.. గ్యాప్ లేకుండా ప్రభాస్ నుంచి వరుస సినిమాలు రావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా వున్నారు..వచ్చే ఏడాది సమ్మర్ లో " ఫౌజీ" రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: