
అలా వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది ప్రగతి. అలా ప్రగతి తెలుగు ,తమిళ్, మలయాళం వట్టి భాషలలో కూడా నటించింది. అయితే అలా హీరోయిన్గా వెలుగుతున్న సమయంలోని ప్రగతికి వివాహం కావడంతో మూడేళ్లు నటనకు దూరమైందట.. అనంతరం సీరియల్స్ ద్వారా మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చిన ఈమె పలు భాషలలో కూడా నటించింది. ప్రగతి ప్రస్తుత వయసు 50 ఏళ్లకు చేరువలో ఉన్నది.. అయినప్పటికీ కూడా తన అందం విషయంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగానే మైంటైన్ చేస్తూ ఉంటుంది. జిమ్ వర్కౌంట్లో, టైట్ ఫీట్లు, స్లీవ్ లెస్ దుస్తులను ధరిస్తూ ఉంటుంది.
ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా ఈమె అసలు పట్టించుకోదు. ముఖ్యంగా ప్రగతి వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిందని చెప్పవచ్చు.. చిన్న వయసులోనే వివాహం చేసుకొని భర్త నుంచి విడాకులు తీసుకొని కుమార్తెతో బయటికి వచ్చేసింది ప్రగతి. తన జీవితంలో పెళ్లి అనే ఒక పొరపాటు వల్ల సుమారుగా తన జీవితం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందని వెల్లడించింది. రెండో పెళ్లి పైన ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయని వీటి పైన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి తోడు అనేది ముఖ్యమే అయినప్పటికీ కూడా తన మెచ్యూరిటీ లెవెల్ కి తగ్గట్టుగా వ్యక్తి దొరకకపోతే చాలా కష్టమని వెల్లడించింది. పెళ్లి గురించి తన వైతి 20 ఏళ్ళు ఉంటే ఆలోచించగలనని కానీ ఇప్పుడు అలా కాదని తెలిపింది.కానీ సమాజానికి మాత్రం తాను మంచి పిల్లలను ఇచ్చాననే విషయంలో చాలా గర్వంగా ఉందని తెలిపింది.