సినిమా ఇండస్ట్రీలో ఓ కాంబినేషన్లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది అంటే మరో సారి ఆ కాంబోలో సినిమా రాబోతుంది అంటే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ లోని చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అలాగే అప్పటి వరకు ఫుల్ మాస్ సినిమాలకు దూరంగా ఉన్న సుకుమార్ ఈ సినిమాతోనే మొట్ట మొదటి సారి ఫుల్ మాస్ మూవీ ని రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ కాంబోలో మరో మూవీ రూపొందబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలను RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో విడుదల చేశారు.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించనుండగా ... ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రంగస్థలం సినిమాకు పని చేసిన వీరంతా కలిసి RC 17 సినిమా కోసం పని చేయడంతో ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. మరి ఈ సినిమా రంగస్థలం సినిమా స్థాయికి చేరుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: