
మగధీర, రంగస్థలం సినిమాలు రామ్ చరణ్ కు ఎంతమేర మంచి పేరు తెచ్చిపెట్టాయో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కూడా అదే స్థాయిలో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారు. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కనిపించనున్నారు. చరణ్ జాన్వీ జోడీ చూడముచ్చటగా ఉండనుందని తెలుస్తోంది.
రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి. దర్శకుడు బుచ్చిబాబు కన్ఫిడెన్స్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా హిట్ గా నిలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ హీరో రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ చరణ్ లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రామ్ చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రామ్ చరణ్ ఇతర భాషల్లో భవిష్యత్తు సినిమాలతో మార్కెట్ ను పెంచుకుంటారేమో చూడాలి.