
మెగా పవర్ స్టార్ గా గ్లోబల్ స్టార్ గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు . ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అయిన కూడా ఆయన తన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గించుకోలేదు . అది రాంచరణ్ స్టేటస్ . గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రామ్ చరణ్ ట్రోల్ చేసిన దాన్ని మెగా ఫాన్స్ ఎలా సునాయాసంగా తిప్పి కొట్టారో మనం చూశాం. కాగా ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్ ఒక సినిమా చేస్తున్నాడు .
అయితే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నాడట . అది కూడా తన మోకాళ్ళకి . ఎస్ రామ్ చరణ్ తన మోకాళ్ళకి సర్జరీ చేయించుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆయనకి మోకాళ్ళలో చిన్న ప్రాబ్లం ఉందట . ఆ కారణంగానే ఆయన పెయిన్ భరించలేక చిన్న మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారట . ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అసలు రామ్ చరణ్ కి ఏం బాగాలేదు..? ఎందుకు మోకాలికి సర్జరీ చేస్తున్నారు..? ఈ వార్త నిజమేనా..? అంటూ చర్చించుకుంటున్నారు . దీనిపై ఎంత త్వరగా రాంచరణ్ స్పందిస్తే అంత బాగుంటుంది అంటూ కూడా మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ గురించి ఎలాంటి వార్తలు వినిపించాయో అందరికీ తెలిసిందే..!