
కొంతమంది హీరోలు అందుకు ఒప్పుకున్న మరి కొంతమంది మాత్రం ఒప్పుకోరు. కాగా గతంలో ఒక క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసి చేసి ఆ కాంబో పై ఆశలు కూడా వదిలేసుకున్నారు. ఆ కాంబో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా రెబల్ హీరో ప్రభాస్. ఇద్దరు తోపైన హీరోలే . ఇద్దరు కాంబోలో సినిమా వస్తే చూడాలి అంటూ ఎంత మంది ఆశపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఆ కోరిక మాత్రం నెరవేరనే లేదు. పవన్ కళ్యాణ్ పలు సినిమాలో నటిస్తూ బిజీ అయిపోయి ...ఇప్పుడు పొలిటికల్ పరంగా ముందుకు వెళ్తున్నాడు .
రెబల్ స్టార్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలను ఓకే చేస్తున్నాడు . అయితే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సింది. రెబల్ మూవీలో ప్రభాస్ హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా ఫ్లాప్ అయింది . నిజానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట రాఘవ లారెన్స్. పవన్ కళ్యాణ్ కి కూడా ఆ కథ వినిపించారట . కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట , ఆ కారణంగానే వీళ్ళ కాంబో లో రావలసిన సినిమా మిస్సయింది. బ్రతికిపోయారు. ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకుంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ నటించిన ఆయన రేంజ్ మారిపోయేది అంటూ అప్పట్లో జనాలు బాగా మాట్లాడుకున్నారు. ప్రజెంట్ ప్రభాస్ పలు బిగ్ బడా సినిమాలతో బిజీగా ఉన్నాడు . పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను త్వరగా కంప్లీట్ చేసేస్తూనే పొలిటికల్ పరంగా ఫుల్ కమిట్మెంట్ తో ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు..!