చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా విశ్వంభర.. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీకి బింబిసారా డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ సినిమాకి దాదాపు 200 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఇక బడ్జెట్ కు తగ్గట్లేప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం..విశ్వంభర మూవీకి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనే వార్తలయితే వినిపిస్తున్నాయి.కానీ అది సాధ్యమేనా అని మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే 100 కోట్ల బిజినెస్ అంటే సినిమా మంచి బజ్ ఉంటే తప్ప అన్ని కోట్ల బిజినెస్ జరగదు. 

సినిమా రిలీజ్ కి ముందు భారీ బజ్ ఉండాలి.అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్ వంటివి ఆకట్టుకున్నప్పటికీ కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. మరోపక్క ఈ సినిమాలో ఎలివేషన్స్,గ్రాఫిక్స్ బాగా లేవని చిరంజీవి,డైరెక్టర్ మధ్య గొడవలు వచ్చాయంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ఇన్ని అనుమానాల మధ్య సినిమా బజ్ బాగుంటే తప్ప 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇక ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగాలంటే భారీగానే ప్రమోషన్స్ నిర్వహించి సినిమాకి భారీ హైప్ పెంచాలి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ త్రిష నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

 ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉండేది.కానీ గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి పక్కకు తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి  ఇక చిరంజీవి విశ్వంభర మూవీ కోసం ఏకంగా 75 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, అలాగే త్రిష  12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపించాయి.ఏది ఏమైనప్పటికి చిరంజీవి విశ్వంభర మూవీ పై మెగా ఫ్యాన్స్ కి భారీ ఆశలు ఉన్నాయి.మరి వారి అంచనాలకు తగ్గట్టు విశ్వంభర మూవీ ఉంటుందా.. సినిమా హిట్ అవుతుందా అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.ఇక విశ్వంభర మూవీ 2025 మే 9న విడుదల కాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: