ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోయిన్లు తమ అందమైన రూపంతో చాలామంది అభిమానులను ఫిదా చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది అభిమానులైతే హీరోయిన్లపై అపారమైన ప్రేమ పెంచుకొని వారిని కలవాలని వారితో మాట్లాడాలని వారితో సెల్ఫీ దిగాలని ఇలా ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక కొంత మంది అయితే మరీ మితిమీరి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఆలోచనలతో వారు అభిమానించే హీరో హీరోయిన్లను పెళ్లిళ్లు కూడా చేసుకోవాలని కలలు కంటారు. కానీ అది కుదరదు. అయితే అలాంటి ఒక దురాలోచనతోనే ఓ వ్యక్తి ఏకంగా హీరోయిన్ ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారట. మరి ఇంతకీ ఆ  ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ నమిత అంటే తెలియని వాళ్ళు ఉండరు. 

నమితకి గుడి కట్టించారు అంటే ఆమెకి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి నమితని ఓ ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారట.ఇక ఆయన ఎవరో కాదు నమిత వీరాభిమాని.. ఇక విషయంలోకి వెళ్తే.. నమిత ఓ రోజు సినిమా షూటింగ్ కోసం కోయంబత్తూర్ వెళ్తుందట. ఆ టైంలో తన మేనేజర్ కూడా తన పక్కనే ఉన్నారట.అయితే కారు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి నేనే మిమ్మల్ని తీసుకువెళ్లే వాడిని అని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నారట.ఇక అలా వెళ్తున్న సమయంలో షూటింగ్ స్పాట్ రాకపోవడంతో అనుమానంతో ఇదేంటి ఇంకా షూటింగ్ స్పాట్ రావడం లేదు అని నమిత అడిగిందట.

కానీ నమిత ప్రశ్నకి డ్రైవర్ తిక్క సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన మేనేజర్ మేడం మీరు కిడ్నాప్ అయ్యారు అని చెప్పారట. దాంతో షాక్ అయిపోయింది నమిత.వాళ్ళు వెళ్తున్న కారు వెనకే మరో ఐదు కార్లు రావడం చూసి భయంతో ఉలిక్కి పడ్డారట. ఇక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా అసలు విషయం తెలిసి నమిత కూడా షాక్ అయిపోయిందట. ఎందుకంటే నమితను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆమె అభిమాని. ఇదంతా ఎందుకు చేశారంటే.. నమితను పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో. అయితే ఈ విషయం తన జీవితంలోనే మర్చిపోలేని ఓ భయంకరమైన సంఘటన అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నమిత.

మరింత సమాచారం తెలుసుకోండి: