
చాలా మంది కుటుంబ సమస్యల కారణంగా లేక మరి ఏదైనా కారణంగా వాళ్ళు కావాలి అనుకున్న రంగంలో సెటిల్ కాలేకపోయి ఉండొచ్చు . ఆ లిస్ట్ లోకి చాలా మంది స్టార్స్ వస్తారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శక ధీరుడు రాజమౌళి గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కష్టానికి నిజాయితీకి మరో మారుపేరే ఈ రాజమౌళి అని చెప్పాలి . ఆయన ఎంతలా సినిమాలను డైరెక్ట్ చేస్తాడో..?? అంతకంటే సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి ఆ మూవీస్.. ఆ విషయం అందరికీ తెలిసిందే .
ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత కష్టపడుతున్నారో మనకి బాగా తెలుసు.. పక్క వాళ్ళని ఎంత కష్టపెడుతున్నాడు అన్న విషయం జనాలు అందరికీ తెలుసు . ఒకవేళ రాజమౌళి డైరెక్టర్ కాకుండా ఉంటే ఏ రంగంలో సెటిలై వుండేవాడు అని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను అని ఒకానొక మూమెంట్ లో తన భార్య సంపాదిస్తే ఆ డబ్బులతో నేను బ్రతికాను అని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఒకవేళ రాజమౌళి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏ టీచింగ్ జాబ్ నో చేసుకొని అలా లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడట . ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!