టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు.

ఇకపోతే చాలా కాలం తర్వాత వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించడం , అప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించి ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే థియేటర్లలో విడుదల అయిన తర్వాత కొన్ని వారాలకు సినిమా ఓ టీ టీ లోకి రావడం , ఓ టీ టీ లోకి వచ్చిన కొన్ని వారాలకు బుల్లి తెరపై ప్రసారం కావడం జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మాత్రం బుల్లితెర మరియు ఓ టి టి రెండిటిలో కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మార్చి 1 వ తేదీన ఈ సినిమాను జీ తెలుగు చానల్లో ప్రసారం చేయనున్నట్లు , అలాగే జీ 5 ఓ టి టి లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒకే రోజు ఇటు బుల్లి తెరపై , అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్విమ్మింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: