తమిళ నటుడు కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాయి. దానితో ఈయనకి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే తెలుగు లో కార్తీ కి యుగానికి ఒక్కడు అనే సినిమాతో మొదట మంచి గుర్తింపు లభించింది. పెద్దగా అంచనాలు లేకుండా తెలుగు లో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చింది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని కార్తీ నటనకు గాను తెలుగు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ మూవీ తో కార్తీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈయన వరుస పెట్టి తాను నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు.

ఇకపోతే తెలుగు లో మంచి విజయం సాధించిన యుగానికి ఒక్కడు సినిమాని మళ్లీ రిట్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 14 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక యూ ఎస్ ఏ లో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: