
అయితే ఇప్పుడు మళ్లీ విశ్వంభర ఓటీటీ బేరాలు మొదలయ్యాయి .. ఇప్పుడు తాజాగా ఓటీటీ నుంచి దాదాపు 65 కోట్ల వరకు బేరం వచ్చిందని టాక్ .. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచి బేరమే కానీ .. ఈ చిత్ర యూనిట్ మాత్రం మరో 10 కోట్లు ఎక్కువగా రావాలని ఆశపడుతుంది .. అలాగే త్వరలోనే ఈ సినిమా నుంచి ఓ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారు .. ఇక ఆ పాటలో విజువల్స్ కూడా చాలా బాగుంటాయట .. అలాగే ఆ సాంగ్ కూడా బాగా వచ్చిందని టాక్ .. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఓటీటీ సంస్థలు రేటు పంచుతాయని అప్పుడు కనీసం 70 కోట్ల వరకు డీల్ సెట్ చేసుకోవచ్చని చిత్ర యూనిట్ భావిస్తుంది.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్ కూడా దాదాపు 38 కోట్లు వరకు అమ్మడయ్యాయని తెలుస్తుంది .. ఇది కూడా చిరంజీవికి హిందీలో మంచి బేరమే.. ఇక వశిష్ట దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది ..ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను తెర్కక్కించారు .. మరో పాట బాకీ ఉంది ఇది కూడా కంప్లీట్ అయితే .. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టే. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు .