తన సంగీతం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకుల లో ఏ ఆర్ రెహమాన్ ఒకరు . ఈయన ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు . ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు అద్భుత మైన విజయాలను అందుకున్నాయి. ఇక రెహమాన్ తన సంగీతం తోనే కొన్ని సినిమాలను విజయం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వం లో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది  ఇలా ఉంటే ఈ మూవీ కోసం రెహమాన్ భారీ ఎత్తున పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రెహమాన్ ఏకంగా 8 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ... రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే రెహమాన్ తాజాగా విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన చావా అనే సినిమాకు సంగీతం అందించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి రెహమాన్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆయనకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: