నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కి గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డాకు మహారాజ్. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఈ సినిమా 150 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టుంది .. ఇలా బాలయ్య వర‌సుగా నాలుగో విజ‌య‌న్ని తన ఖాతాలో వేసుకున్నాడు .. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ‌గా నిలిచింది .. ప్రధానంగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పలు యాక్షన్  సన్నివేశాల స్థాయిని తమన్‌ పెంచేశాడు .. బాలయ్యతో వర‌సుగా నాలుగో విజ‌యాన్ని తమన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు .. ప్రస్తుతం ఓటీటీలో డాకు మహారాజ్ అదిరిపోయే సౌండ్ చేస్తుంది.


థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు డాకు మహారాజ్ రెడీ అయ్యాడు .. రీసెంట్ గానే ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం మొదలైంది .. తెలుగు తో పాటు హిందీ మిగిలిన సౌత్ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు .. మన తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా డాకు మహారాజ్ సినిమాను ఓటీటీలు ఆదరిస్తున్నారు .. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా నెట్‌ ఫ్లిక్స్‌లో డాకు మహారాజ్‌ సినిమా రికార్డు క్రియేట్ చేసింది .. అలాగే ఇండియాలోనే టాప్ ట్రెండ్ అవుతున్న సినిమాగా కూడా డాకు మహారాజ్ నిలిచింది.


ఇక డాకు మహారాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా షేక్‌ చేసిందో ఓటీటీలోను అలాగే అందరి దృష్టి ఆకర్షిస్తుంది .. అన్ని వర్గాల ప్రేక్షకులు డాకు మహారాజ్‌ సినిమాను ఆదరిస్తున్నారు .. దాంతో హిందీ సినిమాలను పక్కనపెట్టి నెట్‌ ఫ్లిక్స్‌లో ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో బాలయ్య డాకు మహారాజ్ నిలిచింది .. అలాగే హాలీవుడ్ సినిమాల స్థాయిలో కూడా ఈ సినిమాకు భారీ వ్యూస్ వస్తున్నాయని నెట్‌ ఫ్లిక్స్‌లో వర్గాలు నుంచి అందుతున్న సమాచారం .. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఉండంతో సినిమా నెట్‌ ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది .. అలాగే ఊర్వశి రౌతేలా చేసిన సీన్స్ దబిడి దిబిడే సాంగ్ కి నార్త్  సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది . అలాగే నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ సినిమాకు వస్తున్న స్పందనకి ఆనందం వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు తమన్ , మరియు దర్శకుడు బాబి సోషల్ మీడియా వేదిక తమ ఆనందాన్ని పంచుకున్నారు.
 

ఇక బాలయ్య అఖండ , వీర సింహారెడ్డి , భగవంతు కేసరి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటంతో డాకు మహారాజ్‌ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ‌ వంశీ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది . అలాగే నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది ..  ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా ప్రగ్యా జైస్వాల్‌ నటించ‌గా ముఖ్యపాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ , ఊర్వశి రౌతేలా నటించ‌రు .. అలాగే బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ కూడా ఈ సినిమాలు విలన్ గా నటించి అదరగొట్టారు .. య‌నిమల్ సినిమాల మాదిరిగానే ఎంతో స్టైలిష్ గా బాబి డియోల్ డాకు మహారాజ్‌ బాలయ్యతో పోటీపడి నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: