నువ్వేమైనా తోపారా..అంటూ నాగార్జున నాగచైతన్యని అవమానించారా..ఇంతకీ ఎందుకు తన కొడుకుని నాగార్జున అవమానించారు.. నాగచైతన్య చేసిన తప్పేంటి.. ఆ వార్నింగ్ వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు వారసత్వంతో వచ్చిన వాళ్లే. అలాంటి వారిలో నాగచైతన్య కూడా ఒకరు.తాత తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చారు. అయితే ఈయన సినిమాల్లోకి వచ్చిన సమయంలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.ఇప్పటికి కూడా ఈయనకు అంత గుర్తింపు అయితే లేదు అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అనే పేరు మాత్రమే ఉంది.కానీ తండేల్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

 అయితే ఒకానొక సమయంలో నాగచైతన్య పొగరుతో మాట్లాడిన మాటలకు నాగార్జున వార్నింగ్ ఇచ్చి తోక కత్తిరించారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగచైతన్య సునీల్ కాంబోలో తడాఖా మూవీ వచ్చింది.అయితే ఈ సినిమా కథ అనుకున్న సమయంలో నాగచైతన్యకు అన్న పాత్రలో సునీల్ నటిస్తారని దర్శకుడు చెప్పారట. కానీ సునీల్ తనతో నటించడం ఇష్టం లేని చైతు ఆయన నాతో సమానమైన పాత్రలో నటించడం ఏంటి..ఆయన వద్దు..వేరే ఎవరినైనా తీసుకోండి అని చెప్పారట.

అయితే ఈ మాటలు డైరెక్టర్ ద్వారా తెలుసుకున్న నాగార్జున నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా.. సునీల్ ని రిజెక్ట్ చేయడానికి నువ్వు అంత పెద్ద హీరోవా.. నీ కంటే సునీల్ పెద్ద.. అలాగే నీకంటే మంచి పేరున్న హీరో..ఆయన నీకంటే ముందే సినిమాల్లోకి కూడా వచ్చారు. అలాంటి మంచి నటుడి ని నా పక్కన వద్దు అని అవమానిస్తావా.. వెంటనే ఆయనకు కాల్ చేసి సారీ చెప్పు అంటూ చైతుకి వార్నింగ్ ఇచ్చారట నాగార్జున.ఇక తండ్రి వార్నింగ్ తో నాగచైతన్య రియలైజ్ అయ్యి సునీల్ కి సారీ చెప్పారట.ఆ తర్వాత వీరి కాంబోలో తడాఖా మూవీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: