నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ లో విశ్వక్ సేన్ హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో శైలేష్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు అడవి శేషు హీరో గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని రూపొందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక హిట్ ది సెకండ్ కేస్ సినిమా చివరలో హిట్ ది థర్డ్ కేస్ సినిమాలో నాని హీరోగా నటించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కొంత కాలం క్రితమే హిట్ 3 సినిమాను ప్రారంభించారు. ఈ మూవీ నుండి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే హిట్ సిరీస్ నుండి వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హిట్ 3 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను సరిగమ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: